Mamita Baiju: యంగ్ హీరోతో జత కట్టనున్న మమిత బైజు.. వావ్ కాంబో అదిరిపోయిందంటున్న నెటిజన్లు (ట్వీట్)

యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju) అందరికీ సుపరిచితమే.

Update: 2025-02-26 08:43 GMT
Mamita Baiju: యంగ్ హీరోతో జత కట్టనున్న మమిత బైజు.. వావ్ కాంబో అదిరిపోయిందంటున్న నెటిజన్లు (ట్వీట్)
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘సర్వోపరి పాలక్కారన్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక ‘ప్రేమలు’ (Premalu)మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించిన మమిత ఒక్కసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ రావడంతో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశానడంలో అతిశయోక్తి లేదు. అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

మమిత బైజు నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రేమలు-2, దళపతి విజయ్(Thalapathy Vijay) జన నాయగన్(Jana Nayagan) వంటి సినిమాల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మమిత బైజు ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ సరసన హీరోయిన్‌గా మమిత నటించనున్నట్లు టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తోంది. అయితే దీనికి కీర్తిశ్వరన్(Keerthiswaran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు కాంబో అదిరిపోయిందని అంటున్నారు.

Tags:    

Similar News