టాలీవుడ్ ఇండస్ట్రీపై మలయాళ స్టార్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran).

Update: 2025-03-22 09:52 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీపై మలయాళ స్టార్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’(L2: Empuran).ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసీఫర్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘ఎంపురాన్-2’మార్చి 27న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్(Mohanlal) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే బెస్ట్. అక్కడ తెలుగు ఆడియన్స్ గౌరవించే విధానం బాగుంటుంది.

నా 47 ఏళ్ల కెరీర్‌లో నేను ఎంతోమంది తెలుగు నటీనటులతో పని చేసే అవకాశం పొందాను. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)తో నటించే చాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేరళలో మేం అన్ని భాషల సినిమాలు చూస్తాం. గతంలో నేను నటించిన మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగులోనే విడుదల చేస్తున్నాం. ఇది సీక్వెల్ కాదు.. మేం ఈ మూవీ కథ అనుకున్నప్పుడే మూడు భాగాలు తీయాలని నిర్ణయించుకున్నాం. ‘ఎల్2: ఎంపురాన్’కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ సినిమా 50 రోజుల కార్యక్రమానికి మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.

 

Tags:    

Similar News

Monami Ghosh