Malavika Mohanan: ‘షార్ట్‌కట్స్ ఉండవు.. కష్టపడితేనే విజయం’.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

తాజాగా నటి మాళవికా మోహనన్(Malavika Mohanan) ఎక్స్ వేదికన అభిమానులతో ముచ్చటించారు.

Update: 2024-12-25 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా నటి మాళవికా మోహనన్(Malavika Mohanan) ఎక్స్ వేదికన అభిమానులతో ముచ్చటించారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చింది. వచ్చే ఏడాది వరుస చిత్రాలతో బిజీగా గడపనున్నానని.. కాగా 2025 తనకు చాలా స్పెషల్ అని మాళవికా వివరించింది. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత క్రిస్మస్(Christmas) బ్రేక్ దొరికిందని.. స్కూల్ మిత్రులను మీట్ అవ్వబోతున్నానని, ఇందుకు చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడించింది. అలాగే ఈ బ్యూటీ యువతకు ఓ సలహా కూడా ఇచ్చింది. ఏదైనా కష్టపడితేనే విజయమని... దేనికైనా షార్ట్ కట్స్ ఉండవని వెల్లడించింది.

వేటా(Veta) సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ నా హృదయానికి ఎంతో చేరువైందని తెలిపింది తమిళంలో మొదటి సినిమా ఇదేనని పేర్కొంది. అలాగే తన జీవితాన్ని మార్చిన సూచన గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. కామెంట్ సెక్షన్ అని చెప్పుకొచ్చింది. దాన్ని అస్సలు చదవద్దని.. అదే నా లైఫ్‌ను ఛేంజ్ చేసిందని వెల్లడించింది. ఇక విరాట్ కోహ్లీ(Virat Kohli), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(icon star Allu Arjun) గురించి ఒక్క మాటలో చెప్పండని అడగ్గా.. వీరిద్దరిలో ఉండే స్పెషాలిటీ, ఆ స్టైల్ఎవరిలోనూ కనిపించదని మాళవికా మోహనన్ చెప్పుకొచ్చింది.      

Tags:    

Similar News