సమంత పై మహానటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా నటించిందంటూ..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘బేబీ జాన్’.
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘బేబీ జాన్’. ఖలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. మురాద్ ఖేతానీ, ప్రియ అట్లీ, జ్యోతి దేశ్ పాండే కలిసి నిర్మిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కామియో రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 25న అనగా నేడు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో కీర్తి సురేష్ సమంత పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. ‘సమంత తేరి సినిమాలో అద్భుతంగా నటించింది. సాధారణంగా రీమేక్ చేయాలంటే భయంగా ఉంటుంది. కానీ, బేబీ జాన్‌కి మాత్రం ఆ క్యారెక్టర్‌ని అందంగా తీర్చిదిద్దడం వల్ల నాకు భయం అనిపించలేదు’ అని చెప్పుకొచ్చింది.
కాగా అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ చిత్రం 2016లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం హిట్ తర్వాత, అట్లీ గత సంవత్సరం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న అట్లీ ‘తేరి’ చిత్రాన్ని రీమేక్ చేశారు. అలా నిర్మాతగా మారి బాలీవుడ్‌లో సినిమా రూపొందించారు. ఇక ఈ చిత్రంలో విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ అలాగే సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించారు.