Kiran Abbavaram: ప్రేమలో ఉన్నవారికే కాదు.. విడిపోయిన వారికి కూడా.. కిరణ్ అబ్బవరం ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకున్నాడు.

Update: 2025-01-03 12:43 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకున్నాడు. అదే ఫామ్‌తో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం విశ్వ కరుణ్(Vishwa Karun) దర్శకత్వంలో ‘దిల్‌రూబా’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రుక్సర్ థిల్లాన్(Ruksar Dhillon) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల కానుంది. అయితే ‘దిల్‌రూబా’(Dilruba) నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, విడుదలై క్యూరియాసిటీ(Curiosity)ని పెంచింది.

ఈ క్రమంలో.. తాజాగా, కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ టీజర్‌ను X ద్వారా షేర్ చేశాడు. దీనికి ‘‘లవ్‌లో ఉన్నవాళ్ల కోసమే కాదు.. బ్రేకప్ అయిన వాళ్ల కోసం కూడా’’ అనే క్యాప్షన్ జత చేశాడు. టీజర్‌లో ఏముందంటే.. కిరణ్ బీచ్ దగ్గర నిల్చొని తను ఓ అమ్మాయిని ప్రేమించి ఫేయిల్ అయ్యాను అని చెప్తాడు. కానీ మళ్లీ తన లైఫ్‌లోకి మరో అమ్మాయి అంజలి వచ్చి ప్రేమను కలిగించిందని అంటాడు. అలాగే ఇందులో యాక్షన్ సీన్స్‌లో కిరణ్ అదరగొట్టాడు.

Tags:    

Similar News