Kiran Abbavaram: ఆ సినిమాలతో ‘దిల్ రూబా’కు ఎలాంటి పోలిక ఉండదు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్
హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’

దిశ, సినిమా: హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dilruba). విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్‌లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేశారు.
‘మేము మూడేళ్ల క్రితమే ఈ సినిమా మొదలుపెట్టాం. అప్పటికి డ్రాగన్ (Dragon), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలు బిగిన్ కాలేదు. అయితే మా కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలతో మా దిల్ రూబాకు ఎలాంటి పోలిక ఉండదు. ఫ్రెష్ అప్రోచ్‌లో మా మూవీ వెళ్తుంటుంది’ అని చెప్పుకొచ్చారు. అలాగే తమిళ మూవీస్ గురించి చెబుతూ.. ‘తమిళ (Tamil) సినిమా కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మనకు తమిళనాట అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాలు ఆదరణ పొందడం లేదు’ అని తెలిపారు. కాగా.. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దిల్ రూబా’ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ వంటివి ఆకట్టుకోగా.. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.