Keerthy Suresh wedding photos: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కీర్తి సురేష్.. జంట ఎంత ముచ్చటగా ఉందో అంటున్న నెటిజన్లు
‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ (Keerthy Suresh).. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood)లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దిశ, సినిమా: ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ (Keerthy Suresh).. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ (Tollywood)లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, కట్టు, బొట్టుతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ‘దసరా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్ అందుకుంది. ప్రజెంట్ రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని (Antony)తో గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న కీర్తి.. రీసెంట్‌గా పెళ్లి (marriage) చేసుకుంది.
గోవా (Goa)లో జరిగిన ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ (Hindu Traditional) పద్దతిలో జరిగిన కీర్తి, ఆంటోని పెళ్లికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియా (social media) వేదికగా అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. కంగ్రాట్స్ అని జంట ఎంత ముచ్చటగా ఉందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
#ForTheLoveOfNyke pic.twitter.com/krtGlussB3
— Keerthy Suresh (@KeerthyOfficial) December 12, 2024