OTT: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన సత్యదేవ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సత్యదేవ్ (Satyadev) నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’ (zebra).
దిశ, సినిమా: డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సత్యదేవ్ (Satyadev) నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’ (zebra). ఓల్డ్ టౌన్ పిక్చర్స్ (Old Town Pictures), పద్మ ఫిలిమ్స్ బ్యానర్ (Padma Films Banner)పై ఎస్ఎస్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ క్రైమ్ ఎంటర్‌టైనర్ (Action Crime Entertainer)ను డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ (Ishwar Karthik) తెరకెక్కించాడు. ఇందులో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్‌గా నటించి మెప్పించగా.. ‘పుష్ప’ ఫేమ్ ధనంజయ (Dhananjaya) ప్రధాన పాత్రలో కనిపించాడు.
నవంబర్ 22న ప్రేక్షుకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ (Positive Talk) సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (Digital Streaming) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha) సొంతం చేసుకోగా.. రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ‘థ్రిల్లింగ్ రైడ్ అండ్ నాన్-స్టాప్ వినోదాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి.. ఆహాలో ‘జీబ్రా’ త్వరలో మీ ముందుకు రాబోతుంది’ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యనప్పటికీ డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
Get ready to witness a thrilling ride and non-stop entertainment soon on #aha#Zebra #ZebraOnAha @ActorSatyaDev @Dhananjayaka @priya_Bshankar @suneeltollywood @JeniPiccinato @amrutha_iyengar pic.twitter.com/xGMNA2T3sF
— ahavideoin (@ahavideoIN) December 12, 2024