Kanguva movie OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కంగువ’ సినిమా.. అధికారిక ప్రకటన విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), శివ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’(Kanguva).

Update: 2024-12-06 09:56 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), శివ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’(Kanguva). ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) కీలక పాత్రలో కనిపించారు. స్టూడియో గ్రీన్(Studio Green), యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదలైంది. కానీ ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది.

మొత్తానికి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కంగువ’ ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్ 8 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘‘కాలం అంత పాత కథ. గద్ద ఒక వారసత్వం. వాటన్నింటినీ పరిష్కరించేందుకు కంగువ వస్తాడు’’ అనే పవర్‌ఫుల్(Powerful) క్యాప్షన్‌ను జత చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారగా సూర్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News