Thangalaan: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
చియాన్ విక్రమ్(Vikram) నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’(Thangalan).

దిశ, సినిమా: చియాన్ విక్రమ్(Vikram) నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’(Thangalan). పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్(Pa. Ranjith) దర్శకత్వం వహించాడు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా(KE Gnanavel Raja) నిర్మించారు. పార్వతి తిరువొతు(Parvathi Thiruvothu), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తంగలాన్ మూవీ ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక థియేటర్లలో తంగలాన్ చిత్రం చూడని వారు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.