Keerthi Suresh: వైరల్‌గా కీర్తి సురేష్ సంగీత్ ఫొటోలు.. ఇదేం సెలక్షన్ రా బాబు అంటున్న నెటిజన్లు

‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

Update: 2025-01-31 12:06 GMT
Keerthi Suresh: వైరల్‌గా కీర్తి సురేష్ సంగీత్ ఫొటోలు.. ఇదేం సెలక్షన్ రా బాబు అంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్ళిపోయింది. అయితే ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) వంటి సినిమాలకు ఏకంగా అవార్డులు కూడా వరించాయి ఈ బ్యూటీకి.

అయితే టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరుస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌(Bollywood)లో కూడా తన సత్తా చూపెడ్డానికి రెడీ అయింది. అలా అక్కడ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన ‘బేబీ జాన్’(Baby John) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ఆశించినంత విజయం అయితే సాధించలేదు. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thatil)తో 15ఏళ్లుగా ప్రేమలో ఉంటూ రీసెంట్‌గా పెళ్ళి(Marriage) కూడా పెళ్లి కూడా చేసుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ క్యూట్ కపుల్ అనిపించుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా సంగీత్ ఫొటోలు షేర్ చేసింది.

అందులో.. తన భర్తతో అదిరి పోయే అవుట్ ఫిట్ ధరించి ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, ఇంత అందాన్ని మేము మిస్ అయిపోయాము, ఇదేం సెలక్షన్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ ఫొటోస్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News

Nikita Sharma