Karthika Deepam: దీపకు జ్యో మీదే అనుమానం..

కార్తీక్ గారేనా.. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది

Update: 2024-12-28 08:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

నేను వెళ్లిన ప్రతి చోట నన్ను బాగా గౌరవిస్తున్నారు. జాబ్ ఇస్తామని చెబుతున్నారు. తీరా జాబ్‌కి ఫామ్ ఫిల్ చేస్తుండగా ‘ఆల్ రెడీ మీరు అప్లై చేస్తున్న జాబ్‌‌లు ఫిల్ అయిపోయాయి’ అని చెప్పి.. నన్ను పంపించేస్తున్నారు. ఇది ఎవరో కావాలని చేపిస్తున్నట్లుగా ఉంది. వాళ్లెవరో తెలియదు నన్ను ఫాలో అవుతున్నారు ?’ అని కార్తీక్ అంటాడు. దాంతో దీపకు అనుమానం వస్తుంది. ‘ కార్తీక్ బాబు వెళ్లిన వెనుకే జ్యోత్స్న కూడా వెళ్లింది కదా.. తనే ఇలా చేస్తుందా .. ? ఏదైనా చేసి ఉంటుందా?’ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ, ఆ విషయం కార్తీక్‌కి చెప్పదు.

ఇక ఉదయాన్నే కార్తీక్ బాబు టీ తాగుతుంటే.. ఒక ఫోన్ వస్తుంది. మీరు ‘కార్తీక్ గారేనా.. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా కంపెనీలో మీకు సెట్ అయ్యే జాబ్ సిద్ధంగా ఉంది. మీరు ఒక్కసారి వచ్చి మా బాస్‌తో మాట్లాడితే సరిపోతుంది’ అని అతను అంటాడు. దాంతో కార్తీక్ సంతోషంగా ఆ అడ్రస్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీధర్ ఉంటాడు. నన్ను ‘గుర్తుపట్టావా? నువ్వు ఎందుకు ఎక్కడెక్కడో తిరుగుతున్నావ్ .. ఇక్కడ జాబ్ పెట్టుకుని .. అయిన నీకు బయట ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరమేంటి? అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే, కార్తీక్ అస్సలు తగ్గడు. ‘ఇంత మోసం చేసి కొంచం కూడా అనుమానం రాకుండా నన్ను ఇక్కడి దాకా వచ్చేలా చేశావ్ అంటే .. నా జాబ్ పోగొట్టింది కూడా నువ్వేనా ' అని అడుగుతాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Read More...

Brahmamudi : రాహుల్ మీద ఫైర్ అయిన రాజ్


Tags:    

Similar News