Karthika Deepam: కార్తీక్ కోసం ఆరాటపడుతున్న సుమిత్ర
కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
ఇక అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. అన్నం పెట్టుకుంటే .. ముద్ద దిగడం లేదు.. అయిన కడుపు నిండితే చాలా.. వాళ్లు ఎలా ఉన్నారో ఏంటో అంటూ చాలా ఏమోషనల్ అవుతూ తినకుండా అలాగే ఉంటుంది. దాంతో దశరథ్ కూడా తినకుండా అలాగే చేస్తాడు. ‘సుమిత్ర తినకపోతే దశరథ్ కూడా తినకుండా ఉందామని వెళ్లిపోయి ఉంటాడు. కానీ, అలా వెళ్లండి’ అంటూ పారు మొత్తం లాగించేస్తుంది. ‘నాకు ఇక చాలు’ అంటూ కన్నీళ్లు తుడుచుకుని తను కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ‘నువ్వు తినవే మనవరాలా’ అని పారు అంటుంది.
' ఆ దీప కోసం అన్నీ వదలుకుని వెళ్లడం నాకు బాధగా ఉంది గ్రానీ’ అని జ్యో అంటుంది. నువ్వేం బాధ పడకు ‘ నాలుగు రోజులు ఆగు వాళ్ళే తిరిగి వస్తారు.. అన్నీ వదులుకుని బతకడం చాలా చాలా కష్టమే’ అని పారు అంటుంది. ‘వీళ్లు అసలు ఎక్కడికి వెళ్లి ఉంటారు?’ అని జ్యో అంటుంది. ‘పౌరుషానికి పోయినవాళ్లు ఎవరు ఇంటికి వెళ్లరు’ అని పారు అంటుంది. ‘మరి భోజనం?’ ఎలా అని జ్యో అంటుంది. ‘ఉంది కదా ఆ వంటలక్క.. ఏదొకటి చేసి అతనికి వండి పెడుతుందిలే..’ అని పారు అంటుంది. ‘అంతేనంటావా?’ అని జ్యో అంటుంది.