Karthika Deepam: వంటలక్కతో బజ్జి తింటున్న కార్తీక్ బాబు

టిఫెన్ షాప్ ముందుకు వెళ్ళి కార్తీక్ డబ్బులు చూసుకుంటాడు. చాలా సేపు వెతికి చివరకు వంద రూపాయలు తీస్తాడు.

Update: 2024-12-24 08:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

టిఫెన్ షాప్ ముందుకు వెళ్ళి కార్తీక్ డబ్బులు చూసుకుంటాడు. చాలా సేపు వెతికి చివరకు వంద రూపాయలు తీస్తాడు. అది చూసిన దీప.. టిఫెన్స్ అమ్మే బాబాయ్.. దగ్గరికి వెళ్లి బజ్జిలు తీసుకుంటారు. అప్పుడే ఓ ప్లేట్ బజ్జీ ఎక్కువ ఇస్తాడు .. ఆ తర్వాత శౌర్య ఇంకా అడుగుతుంది.. కార్తీక్ ఏమి తినకుండా శౌర్యకు ఇచ్చేసి.. ‘నేను వచ్చే ముందు తినేసా .. కడుపు నిండింది.. నాకు ఆకలిగా లేదు’ అని మంచి నీళ్ళు తాగుతాడు. అది చూసి దీప వచ్చి.. తన ప్లేట్ కార్తీక్ వద్దకు తీసుకెళ్లి ‘ తిందాం రండి బాబు’ అంటూ ఒక బజ్జీ తాను.. మరో బజ్జీ కార్తీక్ బాబుకి ఇస్తుంది. సీరియల్ చూసే ప్రేక్షకులు కూడా ఈ సీన్ చూసి ఎంజాయ్ చేస్తారు.

వంటలక్క ఎమోషనల్ అవుతూ.. బజ్జీ చాలా బాగుంది కదా అని కార్తీక్ తో అంటుంది. ‘హా బాగుంది.. అందులో నీతో తింటున్నాను కదా ఇంకా బాగుంది’ అని అంటాడు కార్తీక్ బాబు. ఇంకో వైపు అనసూయ ఒక చీపురు, కాంచన ఇంకో చీపురు పట్టుకుని ఇల్లు శుభ్రం చేస్తుంటారు. ఇల్లు కొంచం కూడా శుభ్రం చేయాలి కదా.. ఇలా మురికగా ఇచ్చాడు ఏంటో .. ఈ ఓనరూ కథ ఏందో మరి? ‘మీకెందుకమ్మా అవన్నీ నేను చేస్తాను.. అని అనసూయ అంటే.. ‘ ఏంటో మరి అయిన కొన్ని పనులు చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుందిలే అక్కా(అనసూయ)’ అంటూ కాంచన కూడా కష్ట పడి ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీధర్ అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Tags:    

Similar News