బికినీ, జీన్స్ ధరించలేదుగా.. హిజాబ్ వివాదంపై స్పందించిన నటి

Update: 2022-02-10 06:58 GMT

దిశ, సినిమా: క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకున్న హిజాబ్ వివాదంపై ప్రముఖ నటి, కర్ణాటక లోక్‌సభ ఎంపీ సుమలతా అంబరీష్ స్పందించారు. రాజకీయ స్వార్థం కోసం ఈ అనవసరమైన అంశాన్ని లేవనెత్తి చిన్నారుల మెద‌ళ్లను విష‌పూరితం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతీ ప్రదేశానికి ఓ ప్రత్యేక కల్చర్, డ్రెస్ కోడ్ ఉంటుంద‌నే విషయం తెలిసినా కొంతమంది కావాలనే ఈ గొడవలు సృష్టిస్తున్నారని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

'ఇక్కడ అమాయకుల మనస్సులను విషపూరితం చేయడానికి చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. పిల్లలు బీచ్ లేదా పూల్‌లో బికినీ ధరిస్తారు. కానీ పాఠశాలలో ధరించరు. ప్రతి మతానికి, ప్రాంతానికి, ప్రతిచోట ఒక్కో ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుంది. బికినీ, జీన్స్ లేదా హిజాబ్ ఏదైనా ధ‌రించే స్వేచ్ఛ మ‌హిళ‌ల‌కు రాజ్యాంగం ప్రసాదించిందనే విషయం మరవరాదు' అన్నారు. మొదటి నుంచి కాలేజీలకు, పాఠశాలలకు కొన్ని మార్గదర్శకాలు ఉండగా ఇప్పుడు మాత్రమే ఈ సమస్య ఎందుకు తలెత్తిందని ప్రశ్నించిన ఆమె.. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకిలా ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

https://twitter.com/ANI/status/1491378548434554882?s=20&t=lcZlL-tYkICFgiECdcRhFg

Tags:    

Similar News