‘జాట్’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్.. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామంటూ మూవీ టీమ్ ట్వీట్..

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT).

Update: 2025-03-22 06:20 GMT
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్.. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామంటూ మూవీ టీమ్ ట్వీట్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni), బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT). పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే పలు హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రూపొందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి ఎస్ తమన్(Thaman) బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. ఇందులో వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘జాట్’ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా(Randeep Hooda)కూడా ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. జాట్ మూవీ నుంచి ట్రైలర్ మార్చి 22న రాబోతున్నట్లు మూటీ టీమ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూవీటీమ్ ట్రైలర్‌కు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. మార్చి 22న అనగా ఈ రోజు రావాల్సిన ట్రైలర్ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తాము. అప్పటి వరకు మాస్ ఫీస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అని రాసుకొచ్చింది. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ కాసింత నిరాశకు గురౌతున్నారు.

Tags:    

Similar News