అది గర్వించదగ్గ విషయం కాదు.. నా విజయాలు తెలుసుకుంటే బాగుండేది: హీనా ఖాన్
గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 నటీనటుల జాబితాలో నటి హీనా ఖాన్(Hina Khan) చోటు దక్కించుకున్నారు.
దిశ, సినిమా: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 నటీనటుల జాబితాలో నటి హీనా ఖాన్(Hina Khan) చోటు దక్కించుకున్నారు. తాజాగా, ఈ విషయంపై ఆమె ఇన్‌స్టా ద్వారా స్పందిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ ఏడాది గూగుల్ టాప్ 10 సెర్చ్‌లో నా పేరు ఉండటంపై చాలా మంది అభిమానులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే, నా వరకు అది ఏ మాత్రం గర్వించదగ్గ విషయం కాదు. నేనేమీ గొప్పగా సాధించలేదు.
అనారోగ్య పరిస్థితుల వల్ల ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్(Google's most searched)లో ఉండే పరిస్థితి ఎవరికీ రావొద్దని నేను కోరుకుంటున్నాను. నా ప్రయాణంలో ఎంతోమంది ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందాను. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలిని. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా వర్క్, నేను సాధించిన విజయాల గురించి సెర్చ్ చేసి ఉండే బాగుండేది’’ అని రాసుకొచ్చింది. ఇక హీనా ఖాన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.