దానిని ఒక ఐస్‌క్రీంలా ఆస్వాదించాల్సిందే.. రిలేషన్‌షిప్‌పై తమన్నా బాయ్‌ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..

నటుడు విజయ్ వర్మ(Vijay Verma), తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

Update: 2025-03-29 09:45 GMT
దానిని ఒక ఐస్‌క్రీంలా  ఆస్వాదించాల్సిందే.. రిలేషన్‌షిప్‌పై తమన్నా బాయ్‌ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..
  • whatsapp icon

దిశ, సినిమా: నటుడు విజయ్ వర్మ(Vijay Verma), తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2023లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్-2’ (Lust Stories-2)వెబ్ సిరీస్ ద్వారా పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారింది. ఇందులో వీరిద్దరు బెడ్ రూమ్ సీన్స్‌లో వీపరీతంగా రొమాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ వర్మ, తమన్నా బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యాఖ్యలు చేయడంతో బ్రేకప్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది.

ఈ క్రమంలో.. తాజాగా, విజయ్ వర్మ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిలేషన్‌షిప్‌ను ఒక ఐస్‌క్రీం లాగా ఆస్వాదించాలి. అలా చేసినప్పుడే సంతోషంగా ఉంటారు. ఆనందం, కోపం చిరాకు, బాధ.. ఇలా ప్రతి అంశాన్ని నువ్వు స్వీకరించాల్సి వస్తుంది. దానితో పాటు ముందుకు సాగాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక వీరిద్దరి బ్రేకప్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ జంట కలిసే ఉన్నారా లేదా అనేది తెలియాలంటే తమన్నా, విజయ్ వర్మ స్పందించాల్సిందే. కాగా, తమన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. ఇది ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. 

Tags:    

Similar News