pushpa-2 కోసం రూ.15 లక్షలు పెట్టి కేశవకు బెయిల్ ఇప్పించనున్నారా?

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం పార్ట్-1 విడుదలై భారీ హిట్ అందుకుంది.

Update: 2023-12-16 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం పార్ట్-1 విడుదలై భారీ హిట్ అందుకుంది. అయితే ఇందులో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా కేశవ పాత్రలో నటించిన జగదీష్ బండారికి ఫుల్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో జగదీష్ బండారి తన ప్రియురాలు ఆత్మహత్య కేసులో ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జగదీష్‌ను నిందితుడిగా అనుమానిస్తూ రెండు వారాల క్రితం హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తాజాగా, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. పుష్ప-2 షూటింగ్ కోసం దర్శకుడు సుకుమార్ జగదీష్‌ను బెయిల్‌తో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. అయినా లాభం లేకుండా పోతుందట. దీంతో జగదీష్‌ నటించిన పుష్పకు వచ్చిన రెస్పాన్స్‌ను చూసిన మూవీ మేకర్స్ ఏకంగా రూ. 15 లక్షలు ఖర్చు పెట్టి అతడిని బెయిల్‌పై రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగితే షూటింగ్ కోసం ఒక నిర్మాణ సంస్థ నటుడిపై ఇంత ఖర్చు పెట్టి మరీ బెయిల్ ఇప్పించడం అనేది చిత్ర పరిశ్రమలోనే మొదటి సంఘటన అవుతుంది. కాగా, పుష్ప-2 అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా మళ్లీ జగదీష్ చేస్తాడా.. లేదా వేరే నటుడితో చేయిస్తారా అన్న దానిపై చర్చలు నడుస్తున్నట్లు టాక్.

Tags:    

Similar News