Sai Dharam Tej: టాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో మరో మెగా హీరో.. త్వరలో పెళ్లి ఫిక్సేనా?
ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్’కు గుడ్ బై చెబుతూ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్’కు గుడ్ బై చెబుతూ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే జూన్ 9న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా, మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ హీరోయిన్ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇటీవల నటించిన ‘విరూపాక్ష’ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో మెగా హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి దగ్గరుండి పెళ్లి చేశాను. కారణం అప్పుడు నా దగ్గర డిగ్రీ తప్ప ఏమీ లేదని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
అలాగే ఒక అమ్మాయి ప్రేమ విషయంలో హ్యాండ్ ఇచ్చింది, అప్పటి నుంచి అమ్మాయిలంటే భయం. తిక్క మూవీ హీరోయిన్ లారిసా బోనేసి చూడగానే నచ్చేసింది డేటింగ్ చేద్దామని అడిగితే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిందని తెలిపారు. అయితే ఇండస్ట్రీలో తనతో నటించిన హీరోయిన్స్ ఎవరు ఇష్టమని? యాంకర్ ప్రశ్నించగా. దానికి సాయి ధరమ్ తేజ్ రెజీనా కాసాండ్రా అంటే చాలా ఇష్టమని తెలిపారు. దీంతో అది తెలిసిన నెటిజన్లు ఆమెను ప్రేమిస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటాడంటూ అనుకుంటున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్, రెజీనా కలిసి పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, వంటి చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్‌తో కలిసి బ్రో చిత్రంలో నటిస్తున్నారు.
Also Read: ఆ హీరోయిన్ అందాలకు సూర్య ఫ్లాట్.. ఫీలింగ్స్ ఆపుకోలేక అలా చేస్తున్నాడా?