Mohanlal: గతంతో పోలిస్తే ఇప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి: ప్రముఖ హీరో

ప్రముఖ హీరో మోహన్‌లాల్(Famous hero Mohanlal) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు కామెంట్స్ చేశారు.

Update: 2025-01-08 13:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో మోహన్‌లాల్(Famous hero Mohanlal) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో 360 సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఒక్క సంవత్సరంలోనే 36 మూవీస్ తీశానని తెలుపడం విశేషం. ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్నానంటే సినిమాలపైనున్న ఆసక్తే అని వివరించారు. అలాగే ఎంతో గొప్ప గొప్ప వారితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. అందరి దగ్గర నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నానని పేర్కొన్నారు. రెస్ట్ తీసుకోవడం తనకు నచ్చదని మోహన్ లాల్ వెల్లడించారు. రీసెంట్ గానే బరోజ్ చిత్రానికి దర్శకత్వం వహించానని.. కానీ డైరెక్టర్‌ కావాలని ముందు నుంచే అనుకున్నది కాదని తెలిపారు.

ప్రేక్షకులు ఇప్పటివరకు తనకు అభిమానించిన ప్రేమకు గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నానని అన్నారు. కాగా ఈ మూవీ తీశానని చెప్పుకొచ్చారు. కానీ ఈ స్టోరీ చాలా కొత్తగా అనిపించిందని వివరించారు. కానీ మలయాళ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చానని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా ఛేంజ్ అయ్యాయని.. ఇండస్ట్రీ ఎంతో డెవలప్ అయ్యిందని పేర్కొన్నారు. పాన్ ఇండియా నటులు కూడా మలయాళ మూవీల్లో నటిస్తున్నారని.. కొత్త డైరెక్టర్లు వచ్చారని అన్నారు. విభిన్నమైన ఆలోచనలతో కొత్త కొత్త కథల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని మోహన్ లాల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News