Allu Arjun: ‘నా జీవితంలో అత్యంత కష్టమైన సీక్వెన్స్ ఇవే’.. ఐకాన్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’ డిసెంబరు 5 వ తేదీన బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

Update: 2024-11-30 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’(Pushpa-2) డిసెంబరు 5 వ తేదీన బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ బిజీలో పడిపోయారు. నిన్న(నవంబరు 29) ముంబయి(Mumbai)లో పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్(Pushpa Iconic Press Meet) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులతో పాటు దేశమంతా ‘పుష్ప-2’ కోసం వెయిట్ చేస్తుందని అన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరగడానికి కారణం లేడీ గెటప్(Lady get up) కూడా ఓ కారణమే అని తెలిపాడు. లేడీ గెటప్ కోసం ఎంతో కష్టపడ్డామని, ఏకంగా మూడు గంటలు మేకప్ వేసుకున్నానని వెల్లడించాడు.

పోస్టర్స్ కోసం పుష్ప గెటప్‌తో పలు ఫొటోలు దిగామని, అన్నీ బాగానే వచ్చాయని.. కానీ దర్శకుడు సుకుమార్ కొత్తగా చేద్దాని అన్నారని పేర్కొన్నారు. ఫొటో షూట్ కంప్లీట్ అయ్యాక.. చెబుతున్నాడేంటి? అని షాక్ అయ్యానని వెల్లడించాడు. ఇక ఆయన ఆలోచన మొత్తం చెప్పాక.. సుకుమార్ చెప్పిన విధంగా చేశానని బన్నీ వివరించాడు. కానీ లేడీ గెటప్ కోసం రెండు సార్లు వర్కౌట్ చేశాక.. మూడోసారి డైరెక్టర్ ఓకే అన్నారని తెలిపాడు. వర్కౌట్ మొత్తం అయ్యాక నా లుక్ నేను చూసుకున్నాక అప్పుడు సుకుమార్ టాలెంట్ గురించి స్పష్టంగా అర్థమైందని చెప్పుకొచ్చాడు. నా లైఫ్‌లో కష్టతరమైన సీక్వెల్స్ ఏమైనా ఉన్నాయంటే.. అవి లేడీ గెటప్ సన్నివేశాలే అని అన్నాడు. 

Read More...

Allu Arjun: సుకుమార్ అలా అనడంతో ఆశ్చర్యపోయా.. లేడీ గెటప్ గురించి అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)


Tags:    

Similar News