ఆఫర్లు కావాలంటే అలా చేయాల్సిందే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-08-22 03:19 GMT

దిశ, సినిమా: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడించిన వారు ఉన్నారు. కానీ, కొందరు మాత్రం అలాంటి అనుభవాలు ఏమీ ఎదురు కాలేదు అని చెప్పుకున్న వారు ఉన్నారు. అలా ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తాజాగా నటి సనమ్ శెట్టి.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సనమ్ శెట్టి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. “తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఇతర పేరు పొందిన సినీ ఇండస్ట్రీలో మాదిరిగానే నటీమణులకు దర్శక నిర్మాతల నుంచి ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఇదే విషయం గురించి పోలీసుల నుంచి పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అయితే వారు ఈ విషయాలన్నింటినీ బయట పెట్టలేకపోతున్నారని తెలిపారు.

అందులో భాగంగా నేను కూడా కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పడక సుఖం ఇస్తేనే ఛాన్స్ ఇస్తా అని ఓ డైరెక్టర్ అన్నారు. అప్పుడు నేను ఛాన్స్‌ల కోసం శరీరాన్ని అమ్ముకునేదాన్ని కాదని చెప్పి బయటకు వచ్చేశాను. అలా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నాను అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎందుకు వాటిని బయట పెట్టరని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఈ సంఘటనల గురించి పరిస్థితుల రీత్యా బయటకు చెప్పలేమని సనమ్ శెట్టి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News