నాగ చైతన్యను హగ్ చేసుకుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable). ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable). ఆహా(Aha)లో స్ట్రీమింగ్ అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఇప్పటికీ ఆరు ఏపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షోకి తాజాగా విక్టరి వెంకటేష్(Victory Venkatesh) వచ్చారు. ఇతనితో పాటు వెంకీ మామ బ్రదర్ దగ్గుబాటి సురేష్(Daggubati Suresh) అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో(Promo)ను తాజాగా రిలీజ్ చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ ప్రోమోలో.. వెంకీ మామ తన మేనల్లుడైన అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎంత మందిని హగ్ చేసుకున్నప్పటికీ.. చైతన్యని హగ్ చేసుకుంటే మాత్రం ఆ ఫీలింగ్ వేరే ఉంటది’ అని చెప్పాడు. ఇక ఈ మాటలకు బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ అమ్మాయినా, నాన్నైనా నువ్వేలే వెంకీ మామా.. అనే సాంగ్‌ను యాడ్ చేశారు. దీంతో ఈ మొత్తం ప్రోమోలో ఈ సీన్ హైలేట్‌గా నిలిచింది. ప్రస్తుతం వెంకటేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. మామ, అల్లుళ్ల అనుబంధం అలాగే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.