టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకుని ఇక్కడికి వచ్చేస్తే అంతే.. జబర్దస్త్ యాంకర్ సెన్సేషనల్ కామెంట్స్

బుల్లితెర జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-28 07:35 GMT

దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో(Jabardasth Show) ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తమ టాలెంట్‌తో అందరినీ మంత్రముగ్దులను చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది ఈ షో ద్వారా వచ్చి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇందులో సౌమ్య రావు నడిగ్(Sowmya Rao Nadig) కూడా ఒకరు. జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో భాగంగా యాంకర్ ‘‘తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కావా మొత్తానికి బెంగళూరు(Bangalore) నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అవొచ్చు కదా? ఇక్కడే ఇల్లు తీసుకొని సెటిల్ అవ్వు అని అడగ్గా.. దానికి సౌమ్య.. ‘‘అయ్యయ్యో ఈ ఇండస్ట్రీని నమ్ముకొని నేను షిఫ్ట్ అయితే అంతే.

ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఉన్నవాళ్లు రేపు ఉండరు, రేపు ఉండేవాళ్ళు ఎల్లుండి ఉండరు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వొచ్చు. దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. దేవుడి దయవల్ల అలాంటి ఒక రోజు వస్తే వంద శాతం ఇక్కడే ఉండటానికి ట్రై చేస్తా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సౌమ్య కామెంట్స్ సోషల్ మీడియా(Social Media)లో దుమారం రేపుతున్నాయి. కొందరు నెగిటివ్‌గా తీసుకుంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Full View

Tags:    

Similar News