ఐకాన్ స్టార్ సినిమాలోని ‘పుష్ప..పుష్ప’ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల.. !
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్ వెరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా అల్లు అర్జున్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక బన్నీ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) అదిరిపోయే ఫర్మామెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ ఏ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా.. సెకండ్ భాగం బన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఏకంగా సెకండ్ పార్ట్ మరో రికార్డును క్రియేట్ చేసింది. 32 రోజుల్లో 1831 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీలో పుష్ప.. పుష్ప.. అంటూ సాగే హీరో ఎంట్రీ పాట జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల అయ్యింది. రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇక బన్నీ ఫ్యాన్స్ వావ్ అంటూ నెట్టింట కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
Read More..
Thalapathy Vijay: విజయ్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. భారీగా ప్లాన్ చేసిన మూవీ మేకర్స్