Sonu Sood: ఆ డైరెక్టర్ నుంచి కాల్ వస్తేనే భయపడేవాడిని.. సోనూసూద్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) తెలుగులో ‘అరుంధతీ’(Arundhati) సినిమాలో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు.

Update: 2024-12-21 11:21 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) తెలుగులో ‘అరుంధతీ’(Arundhati) సినిమాలో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఫతే’(Fateh) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను నా కెరియర్‌లో బాగా కష్టపడిన పాత్ర అరుంధతి సినిమాలోని పశుపతి(Pashupati). ఆ రోల్ నాకు చాలా ప్రత్యేకం. మేకప్ వేసుకోవడానికే నాకు ఆరేడు గంటలు పట్టేది. మేకప్ వల్ల దద్దుర్లు కూడా వచ్చాయి. పగలు, రాత్రి కంటిన్యూగా షూటింగ్ జరిగింది. చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాక డైరెక్టర్ నుంచి ఎప్పుడూ ఫోన్ కాల్ వచ్చినా మళ్లీ యాక్ట్ చేయమంటారేమోనని భయపడేవాడిని. ఈ సినిమా విడుదల తర్వాత ముంబయి(Mumbai) నుంచి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాను. థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ చూసి ఆశ్చర్యపోయాను. మూవీ నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అప్పుడు అర్థమైంది. అదంతా జరిగి అప్పుడే 15 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News