Mohanlal: గొప్ప అనుభవాలతో అలాంటి చిత్రాలు అందించాలనుకుంటున్నా: మోహన్ లాల్

స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Update: 2024-12-28 07:01 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బరోజ్-3డీ’(Barroz 3D) క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ తన ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారో వెల్లడించారు. ‘‘ఇండస్ట్రీ చాలా అందమైనది కాబట్టి భాషతో సంబంధం లేకుండా మొత్తానికి భారతీయ సినిమాగా గుర్తించాలి. అందరూ ఆస్వాదించే మాధ్యమం కాబట్టి అన్ని భాషల్లోనే చిత్రాలు చూస్తారు.

అలా చూసే అలవాటును ప్రేక్షకులు మెరుగుపరుచుకోవాలి. ఇది ఓటీటీ(OTT) యుగం కాబట్టి అన్ని సినిమాలు చూడాలి. ప్రజల్లో మార్పు వచ్చింది. అందుకే మనం జాగ్రత్తగా ఉండి అద్భుతమైన చిత్రాలను మాత్రమే అందించాలి. అయితే గొప్ప సినిమాలు తీసుకురావాలంటే నటీనటులు నిర్మాతలు, దర్శకులు(Directors) అందరిపై బాధ్యత ఉంటుంది. అది విజయం సాధించాలంటే అన్ని కోణాల్లో తీయాలి. అయితే నేను యాక్షన్ సినిమాలు(Action movies) చేయగలను, ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీయగలను. కాబట్టి గొప్ప అనుభవాలతో ఇకపై మంచి చిత్రాలను అందించాలని అనుకుంటున్నాను. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News