ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ నాకు దక్కింది: రాజేంద్ర ప్రసాద్
సరికొత్త కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఓటీటీ(OTT) లవర్స్‌కు అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ‘హరికథ’(Harikatha) అనే మరో సరికొత్త వెబ్ సిరీస్‌ను తీసుకొస్తోంది.
దిశ, సినిమా: సరికొత్త కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఓటీటీ(OTT) లవర్స్‌కు అందిస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ‘హరికథ’(Harikatha) అనే మరో సరికొత్త వెబ్ సిరీస్‌ను తీసుకొస్తోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తుండగా.. మ్యాగీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి(Arjun Ambati), కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇది ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రమంలో.. మేకర్స్ ఈ రోజు ‘హరికథ’(Harikatha) సిరీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో.. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..‘‘సినిమా ఇండస్ట్రీలో నాది 48 ఏళ్ల నట జీవితం. ఇంత సుదీర్ఘ కాలం నటుడిగా కొనసాగడం సాధారణ విషయం కాదు. ఎంతోమంది హీరోలతో కలిసి నటిస్తూ వస్తున్నాను. నటుడిగా నాకు ఇప్పటికీ ‘హరికథ’ లాంటి గొప్ప స్క్రిప్ట్స్(Scripts) రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సిరీస్‌ను చూశాక థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అడుగుతారు. అలాంటి స్ట్రాంగ్ కంటెంట్‌ను ‘హరికథ’ లో చూపిస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన రైటర్స్, డైరెక్టర్ మ్యాగీకి, మా పీపుల్ మీడియా సంస్థకు, హాట్ స్టార్‌కు థ్యాంక్స్. ఏఎన్నార్(ANR), ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ నాకు దక్కడం సంతోషంగా ఉంది. హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో మీకు ‘హరికథ’ లో కనిపిస్తాను’’ అన్నారు.