చరిత్ర సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. 12 గంటల్లోనే ఆర్ఆర్ఆర్, రికార్డ్ బ్రేక్ (ట్వీట్)
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam ).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam ). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే థియేటర్స్‌లో భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు పైరసీ చేయగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తర్వాత డైరెక్ట్ టీవీల్లో ప్రసారం అయి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీంతో అంతా 6 గంటలకు వరకు పని అంతా పూర్తి చేసుకుని టీవీలకు అతుక్కుపోయి ఈ సినిమాను చూసి కడుపు చెక్కలు అయ్యేలా నవ్వుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. అలాగే జీ5లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.తాజాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం 12 గంటల్లోనే 1.3 మిలియన్ వ్యూస్.. 100 మిలియన్లకు పైగా వ్యూ మినిట్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని ఏకంగా 13 లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, హనుమాన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చూడని వారు కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
#SankranthikiVasthunam - All-Time Record on ZEE5 By Beating #RRRMovie pic.twitter.com/JdSlND8QVy
— Aakashavaani (@TheAakashavaani) March 2, 2025