HHVM: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వాలంటైన్స్ డే గిఫ్ట్

టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'.

Update: 2025-02-14 07:31 GMT
HHVM: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వాలంటైన్స్ డే గిఫ్ట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్, పోస్టర్స్, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా హరిహర వీరమల్లు టీం క్రేజీ అప్ డేట్ అందించారు.

'హరిహర వీరమల్లు' నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 'కొల్లగొట్టిందిరో' అనే సాగె లిరికల్ సాంగ్‌ను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగార్వల్‌తో ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్టుర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగ‌భాగానికి పైగా ద‌ర్శకత్వం వహించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా మిగిలిన పోర్షన్‌కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News