HHVM: పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఆ రోజే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఫ్యాన్స్‌కు కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఫ్యాన్స్‌కు కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చింది. హోలీ (Holi) పండుగ వేళ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) మూవీ రిలీజ్ డేట్‌ను ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మే 9న మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. చారిత్రక నేపథ్యంతో మొత్తం రెండు పార్ట్‌లుగా వస్తున్న ఈ చిత్రం క్రిష్ (Krish), జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పటికే మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ (Pavan Fans) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబురాలు చేసుకుంటున్నారు. 17వ శతాబ్దపు కథాంశంతో కొనసాగే మూవీలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal), బాబీ దేవోల్ (Bobby Deol), నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri), నోరా ఫతేహి (Nora Fatehi) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి (MM Keeravani) స్వరాలను సమకూర్చుతున్నారు.