నోరు జారిన హరీష్ శంకర్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. ఆయన రియాక్షన్ ఏంటంటే? (ట్వీట్)
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’(Mr. Bachchan) బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’(Mr. Bachchan) బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం పవర్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh) చేస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. భారీ అంచనాల మధ్య రాబోతుంది. ఈ క్రమంలో.. హరీష్ శంకర్ ‘డ్రాగన్’(Dragon) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మన సినిమాలు తప్ప అన్ని చూస్తారు. కాబట్టి వచ్చేయండి చూసేద్దాం’’ అని చిక్కుల్లో పడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆయన తెరకెక్కించిన మిరపకాయ, గబ్బర్ సింగ్(Gabbar Singh) వంటి చిత్రాలను హిట్ చేసిన ప్రేక్షకుల గురించి అలా మాట్లాడటమేంటని మండిపడుతున్నారు. అలాగే ఇటీవల చేసిన ‘మిస్టర్ బచ్చన్’ అసలు అవుట్‌డేటెడ్ సీన్లతో తీసుకువచ్చి కూనీ చేశాడు. మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేయడం అవసరమా అని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ఏదో నా లాస్ట్ సినిమా చూడలేదని ఫ్లోలో అలా వచ్చేసింది. నేను ఫన్నీగా చెప్పాను. అయినా మీరందరూ నా సినిమాలు చూడకుండానే ఇక్కడి వరకూ వచ్చానా? మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను’’ అని రాసుకొచ్చారు.
Sir ఏదో నా లాస్ట్ సినిమా చూడలేదని అలా వచ్చేసింది…. I said this in a jovial manner …. అందరూ నా సినిమాలు చూడకుండానే ఇక్కడి వరకూ వచ్చనా 😍😍 https://t.co/3CNh5WZBzx
— Harish Shankar .S (@harish2you) February 17, 2025