O Bhama Ayyo Rama: ఓ భామ అయ్యో రామ అంటోన్న సుహాస్.. క్రేజీగా ఆకట్టుకుంటున్న గ్లింప్స్
వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సుహాస్ (Suhas).
దిశ, సినిమా: వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సుహాస్ (Suhas).. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) ఒకటి. లవ్ రొమాంటిక్ (Love Romantic) కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి రామ్ గోదాల (Ram Godala) దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా నటిస్తుంది.
తాజాగా ఈ మూవీ గ్లింప్ (glimpse) రిలీజ్ చేశారు చిత్ర బృందం. గ్లింప్స్ విషయానికి వస్తే.. హీరో హీరోయిన్ ఒక కారులో ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ సరదాగా ఉన్న సమయంలో కార్ సడెన్‌గా ఆగిపోతుంది. అయితే.. హీరోయిన్ కారులోనే ఉండగా హీరో కారును వెనుక నుండి నెడుతాడు. ఈ సీన్ సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ (Positive Impact)ను క్రియేట్ చేస్తుంది. కాగా.. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ మూవీలో.. అనిత హస్సనందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు కీలక పాత్రల్లో కనిపిచనున్నారు.