Vishwak Sen: గెట్ రెడీ వచ్చేస్తున్న సోను మోడల్.. విశ్వక్ సేన్ ‘లైలా’ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Update: 2024-12-24 09:15 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్, రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila). షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున థియేటర్స్ విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ హైప్ పెంచేందుకు వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, లైలా అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. సోను మోడల్(Sonu Model) ఫస్ట్ లుక్ క్రిస్మస్ కానుకగా రేపు డిసెంబర్ 25న ఉదయం 11:07 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు విశ్వక్ సేన్ లేడీ గెటప్ లుక్ విడుదల చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News