Venkatesh: గెట్ రెడీ.. వెంకీ మామ స్పెషల్ మాస్ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.. (ట్వీట్)

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(SankranthikiVasthunam).

Update: 2024-12-28 06:27 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(SankranthikiVasthunam). ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దీనిని దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఇటీవల ‘సంక్రాంతి వస్తున్నాం’ నుంచి వచ్చిన ‘గోదారి గట్టు మీద రామచిలకవే, మీను సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు తెలుపుతూ Xద్వారా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్’(Blockbuster Pongal Song) డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుందని తెలిపారు. అలాగే ‘‘వెంకీ మామ స్పెషల్ మాస్ ట్రీట్ ఫైరింగ్‌గా ఉండబోతుంది’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.


Read More..

ఆ సమయంలో సినిమాల్లోకి ఎందుకొచ్చానా అని చాలా బాధపడ్డా.. : వెంకటేష్


Tags:    

Similar News