గెట్ రెడీ.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో సాంగ్.. తమన్ ట్వీట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’.
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా.. తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘తర్వాతి సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ చేంజర్‌గా మారుస్తుంది. DHOP అంటూ సాగే ఈ సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత దీని గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుంది’ అని ఆయన ట్వీట్ చేశాడు. దీంతో ఈ సాంగ్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.