Movie Shootings: ఏ అగ్ర హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తోన్న ఫ్యాన్స్

డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. తమదైన నటనతో కొన్నేళ్ల నుంచి జనాల్ని అలరిస్తున్నారు సినీ ఇండస్ట్రీ నటీనటులు.

Update: 2024-12-03 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. తమదైన నటనతో కొన్నేళ్ల నుంచి జనాల్ని అలరిస్తున్నారు సినీ ఇండస్ట్రీ నటీనటులు. అప్పట్లో కేవలం పెద్ద హీరోల సినిమాలంటేనే ఇష్టపడే జనాలు.. ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిన్న హీరోల.. చిన్న సినిమాలు అయినా సరే ఎగబడి మరీ వీక్షిస్తున్నారు. అయితే ప్రజెంట్ మన తెలుగు ప్రముఖ హీరోలు కొత్త సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు. కాగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నుంచి.. నేచురల్ స్టార్ నాని(natural  STAR Nani) వరకు ఏ హీరో మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అభిమానుల్లో కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. కాగా షూటింగ్ ప్లేసెస్ ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర(Viśvambhara)’ చిత్రం- అన్నపూర్ణ 7 ఎకరాల్లో షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రభాస్ ‘రాజాసాబ్’(Rajasaab) అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో, బాలకృష్ణ ‘మహారాజ్’(Maharaj) చిత్ర షూటింగ్ చౌటుప్పల్‌, ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో, ధనుష్ శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగార్జున(Nagarjuna) ‘కుబేర’(Kubera) సినిమా నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ‘హిట్-3’(Hit-3) అరుణాచల్ ప్రదేశ్, వెంకటేష్ ‘సంక్రాతికి వస్తున్నాం’(SANKRANTHIKI VASTHUNNAM) సైనికపురి, నిఖిల్ ‘స్వయంభూ’(Swayambhu) అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. వీరితో పాటుగా కుర్ర హీరో తేజ సజ్జా నటిస్తూన్న మిరాయ్(mirai) చిత్ర షూటింగ్ రామోజీ ఫిలీం సిటీలో, కోన నీరజ డైరెక్షన్‌లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న సినిమా పుణెలో షూటింగ్ జరుగుతుంది.

Read More...

Hero Varun Tej : కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్


Tags:    

Similar News