Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న వెంకీ, ఐశ్వర్య జోడి
అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam).
దిశ, వెబ్‌డెస్క్: అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) హీరోగా నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) కథానాయికలుగా కథానాయికలుగా మెరిసే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్(Sri Venkateswara Creations Banner)పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. చిత్రషూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీమ్ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ కొత్త చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు భాస్కరభట్ల(Bhaskarabhatla) లిరిక్స్ అందించారు. అలాగే భీమ్స్ సిసిరోలియో(Bheem Cicerolio) సంగీతాన్ని అందించిన ఈ సాంగ్.. ‘‘గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే.()’ అంటూ సాగుతుంది. ఈ అద్భుతమై పాటను ఫోక్ సింగర్ మధుప్రియ(Folk singer Madhupriya) అండ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల(Music Director Ramana Gogula) కలిసి పాడటం విశేషం. ప్రస్తుతం వెంకీ, ఐశ్వర్య జోడి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.