ఫహాద్ ఫాజిల్‌- త్రిప్తి మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు.

Update: 2024-12-13 13:33 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ గత ఏడాది ఆమె ‘యానిమల్’(Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి తన క్రేజ్‌ను పెంచుకుంది. ఒక్కసారిగా అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను మంత్రముగ్దులను చేస్తుంది. ఇక ఈ ఏడాది త్రిప్తి విక్కీ విద్య కా హో వాలా వీడియో, భూల్ భులయ్యా, బ్యాడ్ న్యూజ్(Bad News) చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం త్రిప్తి ఓ ప్రేమకథా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ(Imtiaz Ali) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్‌(Fahad Fazil) హీరోగా నటిస్తుండగా.. త్రిప్తి హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాతోనే ఫహాద్ బాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ (Pre-production)దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్‌ను పూర్తి చేసి థియేటర్స్‌లో కూడా విడుదల చేయనున్నట్లు టాక్. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Tags:    

Similar News