OTT: ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’

Update: 2025-03-13 10:36 GMT

దిశ, సినిమా: పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandha). ‘మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ చిత్రాన్ని.. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో నూతన దర్శకుడు RVS నిఖిల్ (RVS Nikhil) అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో నిటించి మెప్పించారు. రిలీజ్‌కు ముందు వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఫిబ్రవరి (February) 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో బ్రహ్మానందం తనదైన శైలి నటనతో, కామెండీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ (OTT) రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘బ్రహ్మా ఆనందం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha) సొంతం చేసుకోగా.. ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుట్లు వెల్లడించారు టీమ్.


Ranbir Kapoor: ‘బ్రహ్మాస్త్ర 2’పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన రణ్‌బీర్.. ఆనందంలో ఫ్యాన్స్ 

Tags:    

Similar News