Boney Kapoor: ‘హోలీ చాలా సంతోషంగా గడిచింది’.. అంటూ శ్రీదేవి ఫొటో పంచుకున్న బోనీ కపూర్
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్‌తో స్టార్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే ఈ నటి కన్దన్ కరుణై అనే తమిళ చిత్రంతో బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే కులవిళక్కు అనే తమిళ సినిమాలోనే నటించింది. తర్వాత ఐ. వి శశి గారు దర్శకత్వంలో తుణైవన్ సినిమాలో నటించి మెప్పించింది. తర్వాత బాలచందర్ చిత్రం మూండ్రు ముడిచ్చులో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాల్లో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చిందని చెప్పుకోవచ్చు.
కమల్ హాసన్‌తో గురు, శంకర్ లాల్, సిగప్పు రోజాక్కల్ లో నటించి మెప్పించింది. తాయిళ్లామాల్ నానిల్లై, మీండుం కోకిల, వాయ్వే మాయం, వరుమైయిన్ నిరం సిగప్పు, నీలా మలార్గల్, మూండ్రాం పిరై, 16 వయదినిలే మొదలగు చిత్రాలలో అవకాశం దక్కించుకుంది. ఇక రజనీ కాంత్‌తో, ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు.
శ్రీదేవి అనేక చిత్రాల్లో అద్భుతంగా నటించి.. ఎన్నో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకుంది కూడా. 1981 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, తమిళ చిత్రం మీండుం కోకిలకు, 1989 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, హిందీ చిత్రం చాల్ బాజ్, 1992 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారం, తెలుగు చిత్రం క్షణక్షణం వంటి సినిమాలకు అవార్డులు అందుకున్నారు.
అయితే నిన్న (మార్చి 14) తెలుగు ప్రజలు హోలీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సతీమణి దివంగత శ్రీదేవి హోలీ జరుపుకున్న ఒకప్పటి ఫొటోను బోనీ కపూర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌కు ఆయన ‘హోలీ చాలా సంతోషంగా గడిచింది’.. అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ప్రస్తుతం బోనీ కపూర్ పోస్టుకు శ్రీదేవి అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More..
‘సారీ మై లవ్స్ ఆలస్యంగా విష్ చేస్తున్నందుకు’: రష్మిక మందన్న