బాలయ్య కాళ్ళకు నమస్కరించిన బాలీవుడ్ బ్యూటీ.. అందాల తారపై నెట్టింట ప్రశంసల వర్షం(వీడియో)

ప్రస్తుతం అబుదాబిలోని ఐలాండ్‌లో ఐఫా అవార్డు(IIFA Award)ల కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.

Update: 2024-09-29 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అబుదాబిలోని ఐలాండ్‌లో ఐఫా అవార్డు(IIFA Award)ల కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 27 న మొదలైన ఈ ఈవెంట్ నేటితో (సెప్టెంబర్ 29) ముగియనుంది. ఈ పండుగ కోసం తెలుగు సినీ పరిశ్రమనుంచే కాదు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి 'అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్' అవార్డును, నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు 'గోల్డెన్ లెగసీ' అవార్డును ప్రదానం చేశారు ఐఫా నిర్వాహకులు. అలాగే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్‌(Aishwarya Rai)కు తమిళంలో మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 2(Ponnian Selvan 2) లో ఈమె నటనకు గానూ ఉత్తమ నటి(Best Actress) అవార్డు వరించింది.

కాగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసే సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ఈ అవార్డును బాలకృష్ణ తన చేతుల మీదుగా ఐశ్వర్యరాయ్‌కి ప్రదానం చేయాలని ఐఫా నిర్వాహకులు కోరారు. దీంతో అవార్డు అందుకునేందుకు స్టేజీమీదకు వచ్చిన ఐశ్వర్య అవార్డు తీసుకోవడానికి ముందు బాలయ్య కాళ్లకు నమస్కరించింది. ప్రపంచం మెచ్చిన స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాతే బాలయ్య చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్లోబల్ నటిగా ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌లు త్వరలో విడాకులు తీసుకోనున్నారని నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, దీనిపై అటు ఐష్ కానీ, అభిషేక్ కానీ స్పందించడం లేదు.


Similar News