Trending: అరే ఏంట్రా ఇది.. చేయి కోసుకుని ఎన్టీఆర్ ఫొటోకు రక్త తిలకం దిద్దిన అభిమాని..

సాధారణంగా హీరోలకు చాలా మంది పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అందులో కొంతమంది మాత్రం మితిమీరిన అభిమానాన్ని చూపిస్తారు.

Update: 2024-09-28 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా హీరోలకు చాలా మంది పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అందులో కొంతమంది మాత్రం మితిమీరిన అభిమానాన్ని చూపిస్తారు. ఫేవరేట్ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు.. భారీ భారీ కటౌట్స్ పెట్టి పూల దండలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, పాలాభిషేకాలు చేసి, టపాసులు పేల్చి.. రేపు విడుదల అవుతుంది అనగా ఈ రోజు రాత్రి నుంచే థియేటర్స్‌ దగ్గర సందడి చేస్తుంటారు. ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఓ అభిమాని.. తన అభిమానాన్ని చాటుకోవడం కోసం ఏకంగా హ్యాండ్‌నే కట్ చేసుకుని బ్లడ్‌తో రక్త తిలకం దిద్దాడు. వివరాల్లోకి వెళితే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అందులో భాగంగా ఓ అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఎన్టీఆర్ ఫొటో ముందు చేయి కోసుకుని రక్తంతో తిలకం దిద్దాడు. అయితే అక్కడున్న వారు అతడిని ఆపడం మానేసి ఈ తతంగాన్నంతా వీడియో తీయడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయోద్దని.. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేస్తాడా అని, సినిమా చూశామా ఎంజాయ్ చేశామా అన్నట్లు ఉండాలి కానీ ఏంట్రా ఈ పిచ్చి పని అని తిట్టిపోస్తున్నారు.


Similar News