Regina Cassandra: ‘జాట్’ మూవీ నుంచి రెజీనా లుక్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT ).

Update: 2024-12-13 13:12 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(JAAT ). దీనిని గోపీచంద్ మలినేని(Gopichand Malineni) తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో రణ్‌దీప్ హుడా(Randeep Hooda) విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh), సయామీ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రెజీనా పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ మేకర్స్ ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గ్రీన్ కలర్ చీర కట్టుకున్న ఆమె నవ్వుతూ మెస్మరైజ్ చేస్తోంది.   

 

Tags:    

Similar News