Kannappa: ‘కన్నప్ప’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన స్టార్ హీరో(ట్వీట్)
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’.
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. దాదాపు వంద కోట్లతో దీనిని ఎవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ(24 Frame Factory) బ్యానర్‌పై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ముఖేష్ కుమార్(Mukesh Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో పలువురు సినీ స్టార్స్ ప్రభాస్, మోహన్ బాబు, శరత్ కుమార్, మంచు విష్ణు పిల్లలు, అవ్రామ్, ఇద్దరు కూతుర్లు వివియానా, అరియానా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన విజయుడిని గెలిచిన కిరాత పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ పవర్ ఫుల్ పోస్టర్‌ను వదిలారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.
The wait is over! 🌟 Behold the stunning full look of Lalettan, The Legend, Shri @Mohanlal, as 'Kirata' in #Kannappa🏹. ✨ His dedication and brilliance illuminate this sacred tale of valor and devotion to life.
— Kannappa The Movie (@kannappamovie) December 16, 2024
Feel the divinity and grandeur unfold! #HarHarMahadevॐ… pic.twitter.com/hysfoIuwYw