Dulquer Salmaan: ఆమె ప్రేమ ఇప్పటికీ గుసగుసలాడుతుంది.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

మలయాళ (Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

Update: 2025-02-14 15:48 GMT
Dulquer Salmaan: ఆమె ప్రేమ ఇప్పటికీ గుసగుసలాడుతుంది.. దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ (Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘కాంత’ (kaantha) ఒకటి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి (RanaDaggubati) కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ( bhagyashri borse ) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే లుక్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘చరిత్ర యొక్క ప్రతిధ్వనులలో ఆమె ప్రేమ ఇప్పటికీ గుసగుసలాడుతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన భాగ్యశ్రీ లుక్ ప్రజెంట్ నెటిజనలను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఇప్పుడు భాగ్యశ్రీ లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఉంది. కాగా.. 1950 నాటి మద్రాస్ నేపథ్యంలో ‘కాంత’ సినిమా తెరకెక్కుతోంది.

Tags:    

Similar News