చిన్నప్పుడే లైంగిక వేధింపుల బారిన పడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్

టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-22 02:31 GMT
చిన్నప్పుడే లైంగిక వేధింపుల బారిన పడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య హీరోయిన్.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘క్రాక్’(Krack) మూవీలో విలన్ రోల్‌లో మెప్పించిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా గత ఏడాది ‘హనుమాన్’(Hanuman) సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. ఆ తర్వాత ‘శబరి’(Shabari) సినిమాలో నటించినప్పటికీ అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం ‘శివంగి’(Shivangi) మూవీలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆనంది(Anandi) కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక దీనికి దేవరాజ్ భరణి ధరణ్(Devaraj Bharani Dharan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు(Suresh Babu) నిర్మించారు. అయితే పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు.

కాగా ఈ చిత్రానికి కాషిఫ్ ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ‘కూర్మ నాయకి’(Kurma Nayaki) సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. నికోలయ్ సచ్‌దేవ్‌(Nikolay Sachdev)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా నికోలయ్‌కు ఇది సెకెండ్ మ్యారేజ్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ తమిళ టీవీ షోకు హాజరైన వరలక్ష్మి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మళ్లీ గుర్తు తెచ్చుకుని ఎమోషనలైంది.

టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్న తనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలైంది. ‘నేనూ చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాదీ ఒకటే కథ’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Full View


Tags:    

Similar News