Anupama 'Dragon' : ‘డ్రాగన్’ ట్రైలర్ వచ్చేసింది.. హీరోహీరోయిన్ లవ్ ట్రాక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

తమిళ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా, యంగ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’.

Update: 2025-02-10 15:38 GMT
Anupama Dragon : ‘డ్రాగన్’ ట్రైలర్ వచ్చేసింది.. హీరోహీరోయిన్ లవ్ ట్రాక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: తమిళ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా, యంగ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ఈ మూవీకి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

2 నిమిషాలకి పైగా ఉన్న ఈ ట్రైలర్ కాలేజీ నేపథ్యం, హీరోహీరోయిన్ లవ్, ఎమోషన్స్ ఇంటెన్స్ సీన్స్‌తో ఎంతో అట్రాక్టింగ్‌గా సాగింది. అయితే.. కొన్ని సార్లు కాలేజీ స్టూడెంట్స్ అటెన్షన్, పాపులారిటీకి ఎలా బానిసలవుతారనే దాని చుట్టూ ‘డ్రాగన్’ కథ ఉంటుందని డైరెక్టర్ ఇప్పటికే హింట్ ఇవ్వగా.. ఈ ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపించగా ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మిస్కిన్, కెఎస్ రవికుమార్, విజె సిద్ధూ, హర్షత్ ఖాన్, అవినాష్ పి వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Full View


Tags:    

Similar News