Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ..!

కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ( Jani Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-09 02:42 GMT
Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ( Jani Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని నెలల నుంచి ఇతనికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పుకోవాలి. తాజాగా, జానీ మాస్టర్ (  Jani Master) కు మరో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇతన్ని శాశ్వతంగా తొలగించారు.

అంతేకాకుండా, ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా గెలిచారు. భారీ మెజార్టీతో గెలవడంతో జోసెఫ్ ప్రకాశ్ ప్యానల్ సంబరాలు జరుపుకుంటోంది. ఆదివారం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.

ఇటీవల లేడీ కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక ఆరోపణల కారణంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్ళి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు. బయటకు వచ్చాక.. ఇటీవల ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జానీ మాస్టర్ గెస్ట్ గా హాజరయ్యారు. " కష్టకాలంలో తనకు భార్య, ఫ్యాన్స్ ఎంతో అండగా నిలిచారని చెప్పాడు. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరూ కూడా కనబడరు, కానీ మీరు నన్ను మీ కొడుకులాగా ఆశీర్వదించారు. నాపై నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకొను.. త్వరలోనే అదేంటో మీ అందరికీ కూడా తెలుస్తుందని" ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News